ఓపెనింగ్‌లోనే 100 పాయింట్లు డౌన్
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17690ని తాకినా.. ఇపుడు 17632 వద్ద 134 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నా..అదానీ గ్రూప్‌లో మెజారిటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పేటీఎం బాస్ విజయ్ శర్మ సీఈఓగా కొనసాగేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ షేర్ 3 శాతం పైగా లాభంతో ఉంది. ఫుట్సిలో ఈ నెల నుంచి కోటక్ బ్యాంక్‌ను చేర్చుతారని ఆశించారు. వచ్చే నెల నుంచి ఫుట్సీ నుంచి పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ను తొలగిస్తున్నారు. ఆ షేర్ స్థానంలో కొటక్ చేరుతుందని భావించారు. కాని అలా జరగలేదు. దీంతో ఆ షేర్ 2.5 శాతం క్షీణించింది. ఓఎన్‌జీసీ కూడా 2.5 శాతం కూడా క్షీణించింది. నిఫ్టిలో 42 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలు ఒక శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి నెక్ట్స్ మాత్రమే 0.6 శాతం నష్టంతో ఉంది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిసన్, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ విల్మర్… అన్నీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి.