స్థిరంగా ప్రారంభం
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17566ని తాకిన నిఫ్టి ఇపుడు 17530 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 30 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా… చాలా వరకు షేర్లు నామ మాత్రపు లాభాల్లోనే ఉన్నాయి. ఫలితాలు అద్భుతంగా ఉండటంతో టాటా కెమికల్స్ 8 శాతం దాకా నష్టపోయింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో హాస్పిటల్స్ ఫలితాలు బాగుండటంతో ఈ షేర్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. నాట్కో స్థిరంగా ఉంది. జొమాటొ నిఫ్టి నెక్ట్స్‌లో టాప్ గెయినర్‌గా ఉంది. బ్యాంకింగ్ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్‌లో ఉంది. సిటీ యూనియన్ బ్యాంక్ దాదాపు ఏడు శాతం పెరిగింది. చాలా వరకు బ్యాంక్ షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. ఫలితాలు ప్రకటించిన పలు షేర్లలో లాభాల స్వీకరణ వస్తోంది. నిఫ్టి గనుక పెరిగితే.. ఈ షేర్లలో మళ్ళీ ఆసక్తి కనబర్చే అవకాశముంది.