NIFTY LEVELS: పడితే కొనండి..
ఇవాళ కూడా అదే ఫార్ములా. విదేశీ ఇన్వెస్టర్లు గత అయిదు రోజుల నుంచి భారీగా కొనుగోళ్ళు చేస్తున్నారు. దీంతో నిఫ్టి పడినపుడల్లా కోలుకుంటోంది. ఇవాళ నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17382. చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17450ని తాకేలా ఉంది. అక్కడి నుంచి ఏ కాస్త పెరిగినా అమ్మకాల ఒత్తిడి రానుంది. ఇవాళ క్రెడిట్ పాలసీ ఉన్నందున… బ్యాంక్ షేర్లను జాగ్రత్తగా గమనించండి. 0.35 శాతం మేరకు వడ్డీ రేట్లను పెంచితే మార్కెట్ పాజిటివ్‌గా స్పందించవచ్చు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 17733
రెండో నిరోధం – 17527
తొలి నిరోధం – 17491
నిఫ్టికి కీలకం – 17345
తొలి మద్దతు – 17274
రెండో మద్దతు – 17237
డౌన్ బ్రేకౌట్ – 17182