లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నాస్డాక్ 0.41 శాతం లాభంతో ముగిసినా.. ఎస్ అండ్ పీ 500 సూచీ, డౌజోన్స్ నష్టాల్లో ముగిశాయి. అయితే నష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. రాత్రి డాలర్లో ఒత్తిడి వచ్చింది. డాలర్ ఇండెక్స్ 106 దిగువకు వెళ్ళింది. మరోవైపు ఇలాంటి సమయంలో పెరగాల్సిన క్రూడ్ రాత్రి మరో మూడు శాతం క్షీణించింది. 104 డాలర్ల నుంచి 94 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ క్షీణించింది. భారత్ వంటి మార్కెట్లకు ఇది అనుకూల అంశం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.66 శాతం లాభంతో ఉండగా, చైనా మార్కెట్ల లాభాలు అరశాతం లోపే ఉన్నాయి. చైనా-తైవాన్ మధ్య టెన్షన్ తగ్గడంతో… తైవాన్ సూచీ 1.74 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 74 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి లాభాల్లో ప్రారంభం కానుంది.