లాభాల్లో సింగపూర్ నిఫ్టి
ఈక్విటీ మార్కెట్లన్నీ పరుగులు పెడుతున్నాయి. నిన్న మన మార్కెట్లలో దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారికి ఇవాళ ఆకర్షణీయ లాభాలు రానున్నాయి. నిన్న నిఫ్టి 17215 దాకా క్షీణించిన విషయం తెలిసిందే. ఇవాళ నిఫ్టి ఇవాళ 17500ను తాకుతుందుమో చూడాలి. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నాస్డాక్ క్లోజింగ్‌కల్లా 2.59 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.56 శాతం, డౌజోన్స్ 1.29 శాతం పెరిగాయి. డాలర్ తగ్గినట్లే కన్పించినా… డాలర్ ఇండెక్స్ ఇంకా 107పైనే ఉంది. రాత్రి భారీగా క్షీణించిన క్రూడ్ ధరలు ఇపుడు కాస్త కోలుకున్నాయి. 102 డాలర్ల నుంచి 96.67 డాలర్లకు క్రూడ్ క్షీణించింది. ఇపుడ స్వల్ప లాభంతో ఉంది. మరోవైపు ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. హాంగ్‌సెంగ్ రికార్డు స్థాయిలో 2.07 శాతం లాభంతో ఉంది. జపాన్, షాంగై, చైనా ఏ50 సూచీల లాభాలు 0.7 శాతంపైనే ఉన్నాయి. తైవాన్ సూచీ ఒక్కటే స్వల్ప నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి ఇవాళ 60 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17400ని క్రాస్ చేయనుంది.