For Money

Business News

భారీ లాభాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో అన్ని సూచీలు నష్టాల్లో ఉండగా… జీడీపీ డేటా రావడంతో మార్కెట్‌లో గ్రీన్‌లోకి వచ్చాయి. జీడీపీ డేటా నిరాశాజనకంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉందని వార్తలు రావడంతో మార్కెట్‌ పడుతుందని ఆశించిన వారికి షాక్ తగిలింది. ఎందుకంటే జీడీపీ వృద్ధి రేటు తగ్గడమంటే మున్ముందు ఫెడ్‌ వడ్డీ రేట్లు భారీగా పెరగవని సంకేతం. దీంతో మార్కెట్లు దూసుకుపోయాయి. మూడు ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. డాలర్‌ బలహీనపడటంతో క్రూడ్‌ ఆయిల్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. వారం ఆరంభంలో 95 డాలర్లను తాకిన బ్రెంట్‌ క్రూడ్‌ 102 డాలర్లను దాటింది. మరోవైపు బులియన్‌ కూడా మెరుస్తోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ లాభం అర శాతంలోపే ఉండగా, హాంగ్‌సెంగ్ ఒక శాతం నష్టంలో ఉంది. అయితే సింగపూర్ పూర్ నిఫ్టి మాత్రం 200 పాయింట్ల లాభంలో ఉంది. సో ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17000ను దాటనుంది.