NIFTY LEVELS: 16570 కీలకం
నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. రేపు రాత్రికి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుంది. అలాగే గురువారం వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం. చిన్న ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచింది. ఒకవేళ చేసినా స్ట్రాడల్లో చేయండి.. ఒకవైపు పొజిషన్ తీసుకోవద్దు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి స్వల్ప నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి 16572 వద్ద తొలి మద్దతు అందాల్సి ఉంది. లేదంటే 16555 కీలక స్థాయి. ఒకవేళ ఈ స్థాయికి వస్తే 15528 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని కొనండి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు కూడా అమ్మారు. కాబట్టి లెవల్స్ చూసి… కచ్చిత స్టాప్‌లాస్‌తో పొజిషన్ తీసుకోండి.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 16733
రెండో నిరోధం – 16707
తొలి నిరోధం – 16690
నిఫ్టికి కీలకం – 16638
తొలి మద్దతు – 16572
రెండో మద్దతు – 16555
డౌన్ బ్రేకౌట్ – 16529