For Money

Business News

దిగువస్థాయిలో మద్దతు

ఊహించినట్లే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించింది. నిఫ్టిని 16050 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు యూరప్‌ మార్కెట్లను ఫాలో అవుతున్నారు. ఉదయం నుంచి వంద పాయింట్ల నష్టంలో ఉన్న నిఫ్టి యూరో మార్కెట్ల ఫ్యూచర్స్‌ ప్రారంభమైన వెంటనే నిఫ్టి మరింతగా నష్టపోవడం మొదలైంది.16070ని తాకిన నిఫ్టి ఇపుడు 15100 ప్రాంతంలో ట్రేడవుతోంది. యూఎస్‌ మార్కెట్‌కు భిన్నంగా యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.8 శాతం నష్టంతో ఉంది. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ మార్కెట్లను భయపెడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 108.4 వద్ద ట్రేడవుతోంది. మరి యూరో మార్కెట్లు ఇక్కడి నుంచి కోలుకుంటాయా లేదా మరింత పతనం అవుతాయా అన్నది చూడాలి. ఎందుకంటే దాన్ని బట్టి మన మార్కెట్ ముందుకు సాగేలా ఉంది. అయితే డే ట్రేడింగ్‌ కోసం లాంగ్‌ పొజిషన్స్‌ తీసుకున్న వారు 16050 స్టాప్‌లాస్‌తో మర్చిపోవద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.