For Money

Business News

నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు 2 శాతంపైగా లాభంతో ముగిశాయి. మొన్న సెలవు కావడంతో నిన్న భారీగా లాభాల్లో ముగిసింది వాల్‌స్ట్రీట్‌.అయితే ఇపుడు ఫ్యూచర్స్‌ అరశాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన ఆసియా మార్కెట్లు ఇవాళ నీరసంగా ఉన్నాయి. చాలా సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. తైవాన్‌, కోప్సి ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. చైనా రెడ్‌లో ఉన్నా నామ మాత్రమే. ఇక హాంగ్‌సెంగ్‌ 0.4 శాతం నష్టంతో ఉంది. జపాన్‌ నిక్కీ ఉదయం నుంచి నష్టాల్లో ఉంది. కాని కొద్దిసేపటి క్రితం లాభాల్లోకి వచ్చింది. ఆసియా మార్కెట్లు ఇలా మిశ్రమంగా ఉండగా… నిన్న భారీగా పెరిగిన సింగపూర్‌ నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టంతో ఉంది. 35 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మరి మన ట్రేడింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి SGX నిఫ్టి గ్రీన్‌లోకి వస్తుందేమో చూడాలి. నిఫ్టి మాత్రం స్థిరంగా ప్రారంభం కావొచ్చు.