15,600పైన ముగిసిన నిఫ్టి
ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… ట్రేడింగ్ కొనసాగే కొద్దీ బలపడింది. నిన్న అమెరికా మార్కెట్లకు హాలిడే. ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ పెరిగే కొద్దీ నిఫ్టి పెరుగుతూ వచ్చింది. మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఒక శాతం వరకు లాభంతో ట్రేడ్ కావడంతో నిఫ్టి మరింత బలపడింది. అమెరికా ఫ్యూచర్స్ 1.7 శాతం పెరగడంతో నిఫ్టి ఒకదశలో 15,707ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణతో 15,638 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 288 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 934 పాయింట్లు పెరిగింది. ఇటీవల భారీగా క్షీణించిన బ్లూచిప్ షేర్లన్నీ ఇవాళ కోలుకున్నాయి. ఆరు శాతంపైగా లాభంతో టైటాన్ టాప్‌లో నిలిచింది. ఆ తరవాత హిందాల్కో, కోల్ ఇండియా, JSW స్టీల్, టాటా మోటార్స్ నాలుగు శాతంపైగా లాభంతో నిఫ్టి టాప్ గెయినర్స్‌లో నిలిచాయి. నెస్లే, అపోలో హాస్పిటల్స్‌లో నష్టాల్లో ఉన్నా నామ మాత్రమే. ఇన నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీ నిన్నటి నష్టాలను పూడ్చుకున్నాయి. ఈ రెండు సూచీలు ఇవాళ 2.5 శాతంపైగా లాభంతో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి కూడా 1.55 శాతం లాభపడింది.