For Money

Business News

15,350 వద్ద ముగిసిన నిఫ్టి

రోజంతా నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులతో ట్రేడైంది. ఆరంభంలోనే 15,191కు పడిన నిఫ్టి తరవాత కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. అనేక సార్లు నిఫ్టి నష్టాల్లోకి జారుకుని… కోలుకుంది. 2.45 గంటలకు నిఫ్టి 15255ని తాకింది. సరిగ్గా స్క్వేర్‌ ఆఫ్‌ సమయానికి కోలుకుంది… ఏకంగా 15382ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 56 పాయింట్ల లాభంతో 15350 వద్ద ముగిసింది. నిఫ్టి రోజంతా లాభనష్టాలతో తీవ్ర స్థాయిలో ఊగిసలాండి. కాని ఇతర సూచీలు మాత్రం ఉదయం నుంచి చివరిదాకా భారీ నష్టాల్లో కొనసాగాయి. నిఫ్టి ఫైనాన్షియల్‌ ఒక్కటే 0.96 శాతం లాభంతో ట్రేడైంది. బ్యాంక్‌ షేర్ల సూచీ కూడా స్థిరంగా ఉంది. కాని నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక దశలో రెండు శాతంపైగా నష్టపోయిన నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 1.92 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి గ్రీన్‌లో ఉన్నట్ల్లు కన్పించగా… మార్కెట్‌ చాలా వరకు షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి.