LIC: కొనండి
ఎల్ఐసీ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ సిఫారసు చేసింది. దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ షేర్ ధర లిస్టింగ్ తరవాత 31 శాతం పడిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ షేర్ ధర విషయంలో మార్కెట్ విఫలమైందని ఈ సంస్థ అభిప్రాయపడుతోంది. ప్రస్తుత ధర వద్ద ఎల్ఐసీ షేర్ చాలా చౌకగా లభిస్తోందని పేర్కొంది. కంపెనీ వద్ద ఉన్న పాలసీల్లో కొత్త పాలసీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం ఒక శాతం మాత్రమేనని, వ్యాపారం 99 శాతం పాత పాలసీల నుంచే వస్తోందని జేపీ మోర్గాన్ పేర్కొంది. ప్రస్తుతానికి టార్గెట్ ధర రూ. 840గా పేర్కొంది. అయితే ప్రభుత్వం మున్ముందు కూడా ఎల్ఐసీలో వాటా తగ్గించుకుంటే షేర్ ధర మరింత తగ్గే అవకాశముందని హెచ్చరించింది. ఎల్ఐసీ షేర్ ఇపుడు రూ. 654 వద్ద ట్రేడవుతోంది.