ఫెడ్ నిర్ణయానికి ముందు గ్రీన్లో…
మరికొన్ని గంటల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మార్కెట్ నిజానికి అర శాతం డిస్కౌంట్ చేసింది. అయితే 0.7 శాతానికి కూడా సిద్ధమైందని అంటున్నారు. అందుకే ఈక్విటీ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. నాస్డాక్ రెండు శాతం, ఎస్ అండ్ పీ 500 ఒక శాతం, డౌజోన్స్ 0.77 శాతం చొప్పున లాభంతో ట్రేడవుతున్నాయి. పదేళ్ళ అమెరికా బాండ్లపై ఈల్డ్స్ స్వల్పంగా తగ్గినా 3.3 శాతంపైనే ఉంటోంది. డాలర్ ఇండెక్స్ 105పైన స్థిరంగా ఉంది. బులియన్, క్రూడ్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఒక శాతం మేర వడ్డీ పెంచితే… ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళతాయి. లేదంటే గ్రీన్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు.