For Money

Business News

NIFTY TODAY: పడితేనే మద్దతు

సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిన్నటి భారీ నష్టాల తరవాత ప్రపంచ మార్కెట్లు కాస్త చల్లబడ్డాయి. కాని ఫెడ్‌ ముందు టెన్షన్‌ మార్కెట్లలో కన్పిస్తోంది. అన్నీ స్తబ్దుగా లేదా నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా విదేశీ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఇక్కడా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది కాబట్టి. ఫెడ్‌ గనుక 0.5 శాతం వరకే వడ్డీ పెంచితే మార్కెట్‌లో పాజిటివ్‌ మూమెంటమ్‌కు ఛాన్స్‌ ఉంది. 0.7 శాతం పెంచితే ప్రస్తుత స్థాయిలో కొట్టుమిట్టాడవచ్చు. 1 శాతం పెంచితే మాత్రం మరో పతనం ఖాయం. ఈ నేపథ్యంలో నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించవచ్చు. నిజంగానే మార్కెట్‌ ఓవర్‌ సోల్డ్‌లో ఉంది. కాని ఎక్కడ కొనాలనే అంశంపై మార్కెట్‌లో సందిగ్ధత ఉంది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ – 15857
రెండో ప్రతిఘటన – 15824
తొలి ప్రతిఘటన – 15802
నిఫ్టికి కీలకం – 15750
తొలి మద్దతు – 15662
రెండో మద్దతు – 15640
డౌన్‌ బ్రేకౌట్‌ – 15607