For Money

Business News

డౌజోన్స్‌పై ఒత్తిడి

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఇవాళ భేటీ అయింది. రేపు కూడా భేటీ అయిన తరవాత వడ్డీ రేట్లపై నిర్ణయం వెల్లడించనుంది. తొలుత అర శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతుందని మెజారిటీ బ్యాంకర్లు అంచనా వేశారు. తరవాత సీపీఐ డేటా వచ్చిన తరవాత ఒక శాతం పెంచొచ్చని చాలా మంది భయపడ్డారు. తాజా వార్తల ప్రకారం 0.7 శాతం పెంచే అవకావముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ స్థిరంగా ప్రారంభమైంది. నాస్‌డాక్‌ నామ మాత్రపు లాభాలతో గ్రీన్‌లో ఉన్నా… ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.51 శాతం నష్టంతో ఉంది. కాని డౌజోన్స్‌ ఇవాళ 0.69 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మార్కెట్‌ను ఇప్పటి వరకు డాలర్‌ నుంచి ఒత్తిడి ఉండగా…ఇపుడు బాండ్‌ ఈల్డ్స్‌ నుంచి ఎక్కువ ఒత్తిడి కన్పిస్తోంది. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ గతవారం 2.8 శాతం ప్రాంతంలో ఉండగా, ఇవాళ 3.44 శాతం వద్ద ఉంది. ఇది నిజంగా ఈక్విటీ ఇన్వెస్టర్లను కంగారు పెడుతోంది. మరోవైపు క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 123.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.