For Money

Business News

IPL: టీవీ సోనికి, డిజిటల్‌ వయాకామ్‌18కు?

ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తయింది. ప్యాకేజ్‌ A అంటే టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసార హక్కులను సోని టీవీ దక్కించుకుంది. స్టార్‌ డిస్నీ టీవీ హక్కులు పొందిందని కూడా వార్తలు వస్తున్నాయిఅయితే దీన్ని ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీనికిగాను ఆ కంపెనీ రూ. 23,575 కోట్లు చెల్లించనుంది. ఇక ప్యాకేజీ B అంటే డిజిటల్‌ మీడియా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం హక్కులకు రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18కు దక్కింది. దీని కోసం ఈ కంపెనీ రూ. 20,500 కోట్లు చెల్లించనుంది. దీంతో ఈ వేలం ద్వారా బీసీసీఐకి మొత్తం రూ. 44,075 కోట్లు దక్కాయి. మొత్తం 410 మ్యాచ్‌లను ఈ రెండు సంస్థలు ప్రసారం చేస్తాయి. టీవీలో ప్రసార హక్కుల కోసం సోనీ టీవీ ఒక్కో మ్యాచ్‌కు రూ. 57.5 కోట్లు చెల్లించగా, వయాకామ్‌ 18 ఒక్కో మ్యాచ్‌కు రూ. 50 కోట్లు చెల్లించనుంది. 2023 నుంచి 2027 వరకు ఈ హక్కులు ఉంటాయి. సో.. ఇక మీరు మొబైల్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడాలంటే వూట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోక తప్పదన్నమాట.