ఇపుడూ…ఈ మూడు షేర్లు కొనొచ్చు
మార్కెట్ భారీగా క్షీణిస్తోంది. సూచీలు 52 వారాల కనిష్ఠ స్థాయి వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ సమయంలో కూడా మూడు షేర్లు కొనగోలు చేయాల్సిందిగా ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన అనలిస్ట్ సంజీవ్ భాసిన్ సలహా ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జీ బిజినెస్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ… బుధవారం సమావేశం కానున్న ఫెడ్ కేవలం 0.5 శాతం మాత్రమే వడ్డీ రేట్లు పెంచుతుందని… గురువారం నుంచి మార్కెట్లు చాలా జోరు మీద ఉంటాయని ఆయన అన్నారు. 15700 స్థాయిని నిఫ్టి కాపాడుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూ. 742 ప్రాంతంలో ఎస్బీఐ కార్డ్స్‌ను కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. స్టాప్‌లాస్ రూ.725 ఇస్తూ టార్గెట్ రూ.775 లేదా రూ. 780కి చేరుతుందని ఆయన అన్నారు. రెండో షేర్ ఐసీఐసీఐ బ్యాంక్. ఈ షేర్‌ను రూ.684 వద్ద కొనుగోలు చేయాలని, స్టాప్‌లాస్ రూ. 665 టార్గెట్ రూ.710 లేదా రూ. 715గా ఆయన సిఫారసు చేశారు. మూడో షేర్ టాటా మోటార్స్. రూ.407 వద్ద ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని.. స్టాప్‌లాస్ రూ. 392 కాగా, టార్గెట్ రూ. 440గా పేర్కొన్నారు. గురువారం వీక్లీ ఎక్స్‌పెయిరీ ఉంది… అలాగే ఫెడ్ వడ్డీ నిర్ణయం కూడా వచ్చేస్తుంది. కాబట్టి నిఫ్టి బ్యాంక్ 33500 కాల్‌ను రూ. 280 లేదా రూ. 270 వద్ద కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. రూ. 200 స్టాప్‌లాస్ రూ.400 టార్గెట్‌గా ఆయన పేర్కొన్నారు.