నిఫ్టి 500 పాయింట్లు డౌన్
మార్కెట్‌లో అన్ని వైపుల నుంచి అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి 506 పాయింట్ల నష్టంతో 15695 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1732 పాయింట్లు నష్టపోయింది. ఉదయం నుంచి భారీ నష్టాలతో ట్రేడవుతున్న నిఫ్టికి మిడ్ సెషన్ తరవాత ఒత్తిడి మరింత అధికమైంది. నెస్లే, బ్రిటానియా తప్ప మిగిలిన 48 నిఫ్టి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. అలాగే మెటల్స్. నిన్న మూడు శాతం క్షీణించిన జర్మనీ డాక్స్ ఇవాళ మరో రెండు శాతం క్షీణించింది. నిన్న రాత్రి అమెరికా సూచీలన్నీ మూడు శాతంపైగా నష్టపోయాయి. ఇవాళ ఫ్యూచర్స్ మరో రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అంటే అంతర్జాతీయ మార్కెట్లు ఆరు శాతంపైనే నష్టంతో ఉన్నాయి. మన మార్కెట్లు ఇపుడు మూడు శాతం నష్టంతో ఉన్నాయి. మరి క్లోజింగ్ వరకు ఇదే స్థాయిలో ఉంటాయా? మరింత క్షీణిస్తాయా అన్నది చూడాలి. మరోవైపు బజాప్ ఫైనాన్స్ షేర్ 5.6 శాతం అంటే రూ. 318 నష్టపోగా, బజాజ్ ఫిన్ సర్వ్ కూడా 6.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.