మార్కెట్ మరో 20 శాతం పడుతుంది
మార్కెట్ స్థిరపడటానికి మరో మరో అయిదు లేదా ఆరు నెలలు పడుతుందని ప్రముఖ ఇన్వెస్టర్, హీలియస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా అన్నారు. మార్కెట్ 20 నుంచి 30 శాతం పడే అవకాశముందని ఆయన అన్నారు. ఎకనామిక్ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ నిఫ్టి పతనం వరుసగా పడదని… మరో అయిదారు నెలల్ల కచ్చితంగా 20 శాతం తగ్గుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్థిరపడే వరకు మన మార్కెట్లో కూడా హెచ్చుతగ్గులు తప్పవని ఆయన అన్నారు. నిఫ్టి 14000 లేదా 14500 స్థాయికి క్షీణిస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ క్రిస్ ఉడ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమీర్ అరోరా వద్ద ప్రస్తావించగా…ఫండ్ మేనేజర్లు పది శాతం పతనం అంచనా వేస్తున్నారని… అయితే తన దృష్టిలో నిఫ్టి 20 శాతం దాకా నష్టపోయే అవకాశముందని ఆయన చెప్పారు.