For Money

Business News

NIFTY TODAY: మార్కెట్‌ జోరు

మార్కెట్‌ నిన్న బేర్‌ నోట్‌లో ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమైనా…ఆర్బీఐ పరపతి విధానం ప్రకటించే ముందు పడుతుందేమో చూడండి. ఇవాళ్టి కీలక స్థాయి 16339. ఒకవేళ ఈ ప్రాంతానికి వస్తే నిఫ్టికి తొలి మద్దతు ఉంది. ఆర్బీఐ గనుక 0.25 శాతం మేర వడ్డీ పెంచితే నిఫ్టి భారీ లాభాలతో ముగిసే అవకాశముంది. అలాగే అర శాతం పెంచినా భారీ పతనం ఉండకపోవచ్చని అనలిస్టుల అంచనా. పరపతి విధానం నేపథ్యంలో లెవల్స్‌ చూసి ట్రేడ్‌ చేయండి. స్టాప్‌లాస్‌ మరవొద్దు.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 16555
రెండో ప్రతిఘటన – 16518
తొలి ప్రతిఘటన – 16694
నిఫ్టికి కీలకం – 16444
తొలి మద్దతు – 16339
రెండో మద్దతు – 16315
డౌన్‌ బ్రేకౌట్‌ – 16278