For Money

Business News

ఆ క్యాన్సర్‌ ఆరునెలల్లో మాయం

పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఇది నిజంగానే శుభవార్త. ఈ క్యాన్సర్‌ చికిత్స కోసం తాము అభివృద్ధి చేసిన ఔషధాన్ని కొంత మంది పేషెంట్లపై వైద్యులు ప్రయోగించారు. డొస్టర్లిమాబ్‌ పేరుతో కొత్తగా తయారు చేసిన ఈ ఔషధాన్ని 18 మంది పేషెంట్లకు ఇచ్చారు. వీరందరూ పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నవారే. ఆరు నెలల పాటు వారికి ఈ మందు ఇచ్చారు. ఆరు నెలల తరవాత క్యాన్సర్‌ కణితులు మాయమైపోయాయి. ఈ విషయాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. డొస్టర్లిమాబ్‌ డ్రగ్‌ అనేది లేబొరేటరీలో తయారు చేసిన మాలిక్యూల్స్‌. ఇవి మనిషి శరీరంలో యాంటిబాడీస్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. చికిత్సలో భాగంగా ఇదే డ్రగ్‌ను 18 మంది పేషెంట్లకు ఇచ్చారు. ఆరునెలల్లో పూర్తిగా క్యాన్సర్‌ నయమైంది. ప్రత్యక్ష పరీక్ష, ఎండోస్కోపీ, పొజిషన్‌ ఎమిషన్‌ టొమొగ్రఫీ (PET) స్కాన్స్‌, ఎంఆర్ఐ స్కాన్స్‌లో క్యాన్సర్‌ కణితుల అడ్రస్‌లేదని వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి అని న్యూయార్క్‌కు చెందిన మొమోరియల్‌ స్లోన్‌ కెటెరింగ్‌ క్యాన్సర్ సెంటర్‌ (Memorial Sloan Kettering Cancer Center)కు చెందిన డాక్టర్‌ లూయిస్‌ ఎ డియాజ్‌ జే పేర్కొన్నారు. ఇంతకుమునుపు ఈ పేషెంట్లకు కెమొథెరపి, రేడియేషన్‌, సర్జరీ వంటివి చేయడం వల్ల పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. అయితే ఈ పేషెంట్లకు డొస్టర్లిమాబ్‌ ఇచ్చిన తరవాత క్యాన్సర్‌ పూర్తిగా నయమైంది. అన్ని పరీక్షల తరవాత ఇక వారికి ఎలాంటి వైద్యం అక్కర్లేదని వైద్యులు తేల్చారు. ఏ క్యాన్సరయినా సరే ఇలా పూర్తిగా నయం కావడం ఇదే మొదటిసారి.ప్రస్తుతం ఈ వార్త మెడికల్‌ రంగంలో సంచలనం రేపుతోంది.