For Money

Business News

మూడో రోజు భారీ నష్టాలతో

నిఫ్టి వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. 16,500 దిగువన క్లోజ్‌ కాగా, 16400ని కాపాడుకుంది. ఒకదశలో 16,347ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 16,416 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 153 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 567 పాయింట్లు నష్టపోయింది. ఓపెనింగ్‌లోనే నష్టాల బాట పట్టిన నిఫ్టి అక్కడక్కడ కోలుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. క్రూడ్‌ ఆయిల్‌ ధర భారీగా పెరగడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కంపెనీల పనితీరు బాగా దెబ్బతినే అవకాశాలు అధికంగా కన్పిస్తోంది. ఇదే కారణంగా ఓఎన్‌జీసీ ఇవాళ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది. నిఫ్టిలో భారీ పెరిగిన షేర్‌ ఇదొక్కటే. నిఫ్టిలో మొత్తం 36 షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, మిగిలిన షేర్లు లాభాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు 0.8 శాతం నుంచి 0.9 శాతం వరకు నష్టపోయాయి. రిలయన్స్‌ ఇవాళ గ్రీన్‌లో ముగిసింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన జొమాటొషేర్‌ ఇవాళ 6.72 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్‌, ఎంఆర్ఎఫ్‌ షేర్లు నాలుగు శాతం పైగా నష్టపోయాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా 0.7 శాతం నష్టంతో ట్రడేవుతున్నాయి.