For Money

Business News

భారీ నష్టాల్లో నిఫ్టి

ఉదయం నుంచి నిఫ్టి భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మార్కెట్‌కు అత్యంత కీలకమైన 16400 స్థాయిని బ్రేక్‌ చేసిన నిఫ్టి 16347 దాకా వెళ్ళింది. నిఫ్టి రెండో ప్రధాన మద్దతు స్థాయి 16350. దిగువ స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టి ప్రస్తుతం 16387 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 40 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాల్లో ఉన్న షేర్లలో కూడా నామమాత్రంగానే పెరిగాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌ సూచీలు 1.25 శతం నష్టపోవడం విశేషం. అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌లోకి జారడంతో పాటు యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభం కావడంతో… సెంటిమెంట్‌ కాస్త దెబ్బతింది. రిలయన్స్‌ గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి ఆ మాత్రం నిలబడగలిగింది. అనేక ప్రధాన షేర్లలో ఒత్తిడి వస్తోంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఎల్‌ఐసీ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఈ షేర్‌క ఇపుడ రూ. 753 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇవాళ ఒక్కరోజే ఈ షేర్‌ రూ.24 నష్టపోయింది. ట్రెండ్‌ చూస్తుంటే నిఫ్టి నష్టాల్లోనే ముగిసేలా ఉంది. మరి నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.