స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నామ మాత్రపు నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 16529 పాయింట్లను తాకిన వెంటనే 16560కి చేరుకుంది. ప్రస్తుతం ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టిలో స్వల్ప కరెక్షన్ వచ్చే వరకు ఆగి కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ప్రధాన సూచీలు నష్టాల్లో ప్రారంభం కాగా, నిఫ్టి బ్యాంక్ గ్రీన్‌లో ఉంది. ఆటో షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. నాస్డాక్ పతనంతో ఐటీలో మళ్ళీ కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి నెక్ట్స్ 0.66 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్ 0.46 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఎల్ఐసీ షేర్ ఇవాళ మరో రూ. 10 నష్టపోయింది. రూ. 790 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రూప్ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది.