ఓఎన్జీసీకి MACD అనుకూలం
మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. వాటిల్లో ఓఎన్జీసీ ముందుంది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు భారీగా పెరగడం కారణంగా ఈ కౌంటర్లో ఆసక్తి కన్పిస్తోంది. ఇంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ,వన్ మొబైల్ గ్లోబుల్, లుపిన్, ఆప్టెక్, జేబీఎం ఆటో,. ఆర్ఎస్ డబ్ల్యూఎం, నహర్ ఇండస్ట్రీస్ కౌంటర్లలో కూడా MACD అనుకూలంగా ఉంది. కొన్ని షేర్లలో బేరిష్ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… కొటక్ మహీంద్రా బ్యాంక్ ముందుంది. ఇంకా మారికొ, గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్, కాల్గేట్ పామోలివ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఈ షేర్లలో పతనం ప్రారంభమైనట్లు కన్పిస్తోంది.
శుక్రవారం ట్రేడింగ్ చూస్తే… వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, గ్రాసిం, ఐసీఐసీఐ బ్యాంక్, ముందున్నాయి. అదే వాల్యూమ్ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, హిందాల్కో, పవర్‌గ్రిడ్ ముందున్నాయి.