TECH VIEW: 16400 కీలకం
టెక్నికల్‌గా చూస్తే నిఫ్టి రోజువారీ చార్ట్‌లు చాలా బలహీనంగా ఉన్నాయి. శుక్రవారం అమ్మకాల ఒత్తిడి తరవాత రోజువారీన నిఫ్టిలో పెద్ద బేరిష్ క్యాండిల్ ఏరప్డింది. అదే వీక్లీ ప్రాతిపదికన చూస్తే చిన్న బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. అలాగే పై స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. 16400 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభించే అవకాశముంది. అలాగే 17000 వద్ద ఒత్తిడికి ఆస్కారం ఉంది. ఇక ఎఫ్ అండ్ ఓ విభాగానికి వస్తే 16750 లేదా 16850 మధ్య నిఫ్టికి ఒత్తిడికి ఛాన్స్ ఉంది. పడితే వెంటనే నిఫ్టికి 16450 లేదా 16400 మధ్య మద్దతు లభించవచ్చు. దిగువస్థాయి అంటే 16400 దిగువకు వెళితే నిఫ్టి 16200 లేదా 16000 స్థాయికి పడే అవకాశముంది.