పడి లేచిన నాస్డాక్
ఇవాళ మైక్రోసాఫ్ట్ మార్కెట్‌కు షాక్ ఇచ్చింది. ఆదాయం, నికర లాభం పరంగా గైడెన్స్‌ను తగ్గించింది. బలమైన డాలర్ కారణంగా కంపెనీ టర్నోవర్, లాభం కూడా తగ్గుతుందని పేర్కొంది. దీంతో ఆరంభంలో ఈ షేర్ రెండు శాతంపైగా నష్టపోయింది. తరవాత మార్కెట్ కోలుకుంది. నష్టాల నుంచి సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా నాస్డాక్ 1.98 శాతం లాభపడింది.అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీకూడా ఒక శాతంపైగా పెరిగింది. డై జోన్స్ 0.6 శాతం లాభపడింది. దాదాపు అన్ని టెక్ షేర్లు రెండు శాతం నుంచి ఆరు శాతం దాకా పెరిగాయి. డాలర్ ఇవాళ అనూహ్యంగా 0.7 శాతం క్షీణించింది. బాండ్ ఈల్డ్స్ కూడా స్వల్పంగా తగ్గాయి. మరోవైపు ఇవాళ అమెరికా వారాంతపు చమురు నిల్వలు తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. ఇపుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 117 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ భారీగా పడటంతో బంగారం ఒక శాతంపైగా పెరిగింది.వెండి కూడా రెండు శాతం దాకా పెరిగాయి.