For Money

Business News

నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి

ఉదయం ఆరంభంలోనే 16443 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి.. తరవాత కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చాక… 16598 పాయింట్లను తాకింది. ఇపుడు 16568 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ముడిచమురు ధరలు భారీగా క్షీణించడంతో బీపీసీఎల్‌ కూడా రెండు శాతందాకా పెరిగింది. అయితే బ్యాంక్‌, ఫైనాన్షియల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు డల్‌గా ఉన్నాయి. ఇంకా నష్టాల్లోకొనసాగుతున్నాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కావడంతో ట్రేడింగ్‌ చాలా వరకు సూచీ ప్రధాన షేర్లకే పరిమితమైనట్లు కన్పిస్తోంది. సూచీలు పెరుగున్నా…నాన్‌ ఇండెక్స్‌ షేర్లు పడుతున్నాయి. మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. మరి నిఫ్టి క్లోజింగ్‌కల్లా మరింత బలపడుతుందా? లేదా లాభాలను కోల్పోతుందా అన్నది చూడాలి. అనలిస్టులు మాత్రం నిఫ్టి గ్రీన్‌లోనే ముగిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.