OPENING: నిఫ్టికి దిగువన మద్దతు
సింగపూర్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 16450 దిగువకు వచ్చింది. 16443 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16448 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 74 పాయింట్లు క్షీణించింది.నిఫ్టిలో ఏకంగా 43 షేర్లు లాభాల్లో ఉండగా, ఏడు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాలన్నీ నామ మాత్రంగా ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్ అర శాతం నష్టంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్‌లో పెద్ద మార్పుల్లేవ్. సుగర్ సెక్టార్లో శ్రీరేణుక సుగర్స్, ధామ్‌పూర్ సుగర్స్ లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్ ఇవాళ కూడా ఒక శాతం లాభపడింది. అయితే టాప్ గెయినర్ మాత్రం టాటా స్టీల్. క్రూడ్ ధరలు తగ్గినందున ఏషియన్ పెయింట్స్ కూడా నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఉంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు పెరుగుతున్నా… ఎల్ఐసీ షేర్లలో పెద్దమార్పు లేదు. రూ 812 వద్ద ట్రేడవుతోంది.