TECH VIEW: 16400 కీలకం
నిన్న మార్కెట్లో డైలీ చార్ట్‌లో చిన్న పాటి బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. అనలిస్టులు మాత్రం మార్కెట్లో పాజిటివ్ మూవ్మెంట్ ఉందని అంటున్నారను. నిఫ్టి 16400 పైన ఉన్నంత వరకు ఢోకా లేదని అంటున్నారు. ఇన్వెస్టర్లు రోజువారీ ఈ స్థాయిని గమనించాలని, ఒకవేళ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే స్టాప్‌లాస్ 16400గానే కొనసాగించాలని అంటున్నారు. ఎఫ్ అండ్ ఓ విభాగంలో లావాదేవీలను చూస్తే కాల్ విషయంలో 17000 స్థాయితో పాటు 16800 స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ పెరుగుతోంది. ఇక పుట్ విషయలో 16400 స్థాయి కీలక కానుంది. ఈ స్థాయిలో పుట్ రైటింగ్ జోరుగా ఉంది. ఆ తరవాత 16500 వద్ద కూడా పుట్ రైటింగ్ ఉంది. పుట్ రైటింగ్ అధికంగా ఉన్న స్థాయిని మద్దతు స్థాయిగా ఇన్వెస్టర్లు భావించవచ్చు.