ఈ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి…
మూమెంటమ్‌ను సూచించే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవెర్జెన్స్ (MACD)ను బట్టి చూస్తే కొన్ని షేర్లలో బుల్లిష్ ట్రేడ్ సెటప్ కన్పిస్తుంది. అవి.. ఏఐఏ ఇంజినీరింగ్, ఫైన్ ఆర్గానిక్, టిమ్కిన్ ఇండియా, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, ఎం అండ్ ఎం, ఫినిక్స్ మిల్స్, హెచ్ఏఎల్. 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటిన ఈ షేర్లలో బుల్లిష్ సెంటిమెంట్ కన్పిస్తోంది.
కొన్ని షేర్లలో బేరిష్ ధోరణి కన్పిస్తోంది. ఆ షేర్లు… హైకాల్, ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్, జుబ్లియంట్ లైఫ్సైన్సస్, విజయ డయాగ్నస్టిక్స్, అనుపమ్ రసాయన్, నాట్కో ఫార్మా. ఈ షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకడమే గాక.. అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
నిన్నటి ట్రేడింగ్ చూస్తే… వాల్యూ (విలువ) పరంగా చాలా యాక్టివ్‌గా ఉన్న షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా ఎలెక్సి, భారతీ ఎయిర్టెల్, అదానీ గ్రీన్, కొటక్ బ్యాంక్, జిందాల్‌స్టీల్, ఇన్ఫోసిస్ ముందున్నాయి. అదే వాల్యూమ్ (ట్రేడింగ్ పరిమాణం) ఆధారంగా చూస్తే వోడాఫోన్ ఐడియా, జొమాటొ, సుజ్లాన్ ఎనర్జి, ఎన్టీపీసీ, జేపీ పవర్, జిందాల్ స్టీల్ ఉన్నాయి.