For Money

Business News

ఆధార్‌ జిరాక్స్ కాపీలు ఇవ్వొద్దు

ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఎవరికంటే వారికి ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇలా ప్రజల నుంచి తీసుకున్న జిరాక్స్‌ ఆధార్ కార్డుల దుర్వినియోగం పెరుగుతున్నాయని కేంద్రం పేర్కొంది. UIDAI అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతరులు ఒకవేళ జిరాక్స్‌ కాపీ అడిగితే మాస్క్డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది. మాస్క్‌ ఆధార్‌ కార్డును https://myaadhaar.uidai.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిచంఇంది. మాస్క్‌ ఆధార్‌ కార్డులో నంబర్‌ చివరి నాలుగు నంబర్లు మాత్రమే ఉంటాయి. వాటిని UIDAI వెబ్‌సైట్‌ ద్వారా వెరిఫై చేసుకునే అవకాశముంది. కాబట్టి హోటల్స్ , సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్ కార్డు జిరాక్స్‌ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.