For Money

Business News

నైకా.. ఏ క్యా కియా?

గత ఏడాది స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన న్యూఏజ్‌ ఐపీఓల్లో నైకా (మాతృసంస్థ పేరు FSN E-commerce Ventures) ఒకటి. ఆన్‌లైన్‌ ద్వారా బ్యూటీ ప్రొడక్ట్స్‌ను అమ్ముతూ విదేశీ కంపెనీలను కూడా ఆకర్షించిన ఈ కంపెనీ ఐపీఓకు విశేష ఆదరణ లభించింది. షేర్‌ ధర రెట్టింపైంది. కాని సంగానికి పైగా పడి.. ఇష్యూ ధరకన్నా దిగువకు వచ్చేసింది. ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చిన ఈ కంపెనీ.. తాజా ఫలితాలు వారికి మరో షాక్‌గా మిగిలాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం అంటే సగానికి క్షీణించాయి. వ్యాపారం డల్‌గా ఉండటంతో పాటు ముడి పదార్థాల వ్యయం భారీగా పెరగడం దీనికి కారణమని కంపెనీ అంటోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 8.56 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 16.88 కోట్లు. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 741 కోట్ల నుంచి రూ. 973 కోట్లకు చేరింది.ఇక స్టాండలోన్‌ నికరలాభం రూ. 29 కోట్ల నుంచి రూ. 7.6 కోట్లకు తగ్గింది. రెవెన్యూ రూ. 1098 కోట్ల నుంచి రూ. 973 కోట్లకు పడిపోయింది. వ్యాపార మార్జిన్‌ 6.2 శాతం నుంచి 3.9 శాతానికి పడిపోయింది.