నిరాశపర్చిన జీ
మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ డల్ రిజర్ట్స్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం రూ. 181 కోట్లకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 272 కోట్లు. అంటే మూడో వంతుకు నికర లాభం పడిపోయిందన్నమాట. ఆదాయం మాత్రం రూ. 1984 కోట్ల నుంచి రూ. 2361 కోట్లకు పెరిగింది. కోవిడ్ కారణంగా వ్యాపార కార్యకలాపాలు మందగించాయని కంపెనీ పేర్కొంది. దీంతో మునుపటి ఫలితాలతో పోల్చలేమని తెలిపింది. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1122 కోట్ల నుంచి రూ. 1119 కోట్ల తగ్గిందని పేర్కొంది.అయితే సబ్స్క్రిప్షన్ రెవెన్యూ రూ. 808 కోట్ల నుంచి రూ. 854 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.