స్వల్ప లాభాల్లో SGX నిఫ్టి
నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. సో… మొన్న రాత్రి కనిష్ఠ స్థాయి నుంచి షేర్ల ధరలు పెరుగుతున్నాయి. మధ్యలో ఆటుపోట్లకు గురైనా క్లోజింగ్ కల్లా గ్రీన్‌లో ఉంటున్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్ 1.5 శాతం పైగా లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సుమారు ఒక శాతం వరకు లాభంతో ముగిసింది. డౌజోన్స్ కూడా ఒక మోస్తరు నష్టాలతో గ్రీన్‌లో ముగిసింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం దాదాపు అన్నీ రెడ్‌లో ఉన్నాయి. జపాన్ స్వల్ప నష్టంతో ఉండగా, హాంగ్‌కాంగ్ 0.73 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. ఇతర మార్కెట్లలో నష్టాలు అరశాతం కన్నా తక్కువే ఉన్నాయి. కరెన్సీ, ఆయిల్, బులియన్ మార్కెట్లలో పెద్ద మార్పులు లేవు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 64 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి కూడా గ్రీన్‌లోనే ఆరంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.