తెలంగాణకు పెట్టుబడుల వరద
పక్కా ప్లాన్‌తో వెళ్ళిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పలు అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇది వరకే వారితో చర్చలు జరిపి.. ఫైనల్‌గా దావోస్‌లో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి మాత్రమే ప్రజా ప్రతినిధులు వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధిక పెట్టబడులను ఆకర్షించి కేటీఆర్ నవంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు కన్పిస్తోంది. ఇవాళ ఒక్కరోజే పలు కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. షైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ, స్టాడ్లర్ రైల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి.
కుదరిన ఒప్పందం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశార. ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ. 1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నది. మేధా సర్వో డ్రైవ్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌లో ఈ పెట్టుబడి పెట్టనుంది.అలాగే షైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఓకే చెప్పింది. కంపెనీ విస్తరణపై మంత్రి కేటీఆర్‌తో షైడర్ కంపెనీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో నెలకొల్పిన తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఫొటో: స్టాడ్లర్ రైల్ కంపెనీ ప్రతినిధితో కేటీఆర్