దిగువ స్థాయలో కొనొచ్చు
మార్కెట్ ఇవాళ దిగువ స్థాయి నుంచి కోలుకోవచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ.. నిఫ్టి కన్నా నిఫ్టి బ్యాంక్ పెరిగే ఛాన్స్ అధికంగా ఉందని అన్నారు. 200 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టి బ్యాంక్‌ను కొనుగోలు చేయొచ్చని అన్నారు. ప్రథమార్థంలో నిఫ్టి గ్రీన్‌లోనే ఉంటుందని… అయితే యూరో మార్కెట్లు ప్రారంభమైన తరవాత అంటే ద్వితీయార్థంలో ఇన్వెస్టర్లు సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక షేర్ల విషయంలో అల్ట్రాటెక్ సిమెంట్‌ను ఇవాళ్టికి షార్ట్ చేయొచ్చని అన్నారు. కోల్ ఇండియా (స్టాస్లాస్ రూ.178) కొటక్ మహీంద్రా బ్యాంక్ (స్టాప్‌లాస్ రూ. 1840) టాటా మోటార్స్ (స్టాస్లాస్ రూ. 415) కోరమాండల్ ఇంటర్నేషనల్ (స్టాప్‌లాస్ రూ. 950) షేర్లను పొజిషనల్ ట్రేడ్ కోసం కొనుగోలు చేయొచ్చని సుదర్శన్ సుఖాని అన్నారు. మార్కెట్ భారీ పతనం ఉండకపోవచ్చని… అయితే భారీ రికవరీ కూడా కష్టమని అన్నారు.