రెండు వారాల గరిష్టానికి బంగారం
అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లకు చేరింది రెండు వారాల క్రితం. బంగారానికి అది అత్యంత కీలక మద్దతు స్థాయి. కొన్ని రోజులు ఈ స్థాయి వద్ద నిలదొక్కున్న బంగారం మెలమెల్లగా పెరుగతూ ఇపుడ 1861 డాలర్లను దాటింది. మన మార్కెట్లో కూడా స్టాండర్డ్ బంగారం ధర రూ. 50000 దిగువకు వచ్చింది రెండు వారాల క్రితం. క్రమంగా పెరుగుతూ ఇపుడు రూ.51000 దాటింది. ప్యూచర్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం కాంట్రాక్ట్ నిన్న రాత్రి రూ.258 పెరిగి రూ.51,165కి చేరింది. అలాగే వెండి కూడా రూ.684 పెరిగి రూ.61,987ను తాకింది. అమెరికాలో ట్రెజరీ బాండ్స్‌పై ఈల్డ్స్ తగ్గడం, డాలర్ బలహీనపడటం దీనికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు అంటున్నారు. నేటితరం ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్ కన్నా… ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. పెట్టుబడి సురక్షితంగా ఉండటమేగాక… మంచి ప్రతిఫలాలు కూడా అందుతున్నాయి.