కొనసాగిన అమ్మకాల ఒత్తిడి
ఇవాళ కూడా మార్కెట్ పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఆరంభ లాభాలు కోల్పోయిన నిఫ్టి మిడ్ సెషన్లో కోలుకుంది. ఒక మోస్తరు లాభాల్లోకి వచ్చినా… యూరో మార్కెట్ల ప్రారంభం తరవాత నష్టాల్లోకి జారుకుంది. యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతుండటంతో మన ఇన్వెస్టర్లు డీలా పడ్డారు. నిఫ్టి ఒకదవలో 16078ని తాకింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 16125 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 90 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయింది. ఇవాళ నిఫ్టిలో టాప్ గెయినర్‌గా డాక్టర్ రెడ్డీస్ నిలబడింది. అదే నిఫ్టిలో టాప్ లూజర్‌గా దివీస్ ల్యాబ్ నిలిచింది. దివీస్ ల్యాబ్ ఇవాళ ఆరు శాతం నష్టంతో రూ. 236 నష్టంతో రూ.3663 వద్ద ముగిసింది. హిందుస్థాన్ యూనిలివర్ కూడా మూడు శాతం పడటం విశేసం. నిఫ్టి బ్యాంక్ స్వల్ప లాభంతో క్లోజ్ కాగా… మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ 0.84 శాతం నష్టపోవడం విశేషం. జొమాటో నష్టాలు మూడు రెట్లు పెరిగాయి. కాని షేర్ ఇవాళ 14.75 శాతం లాభంతో రూ.65.45 వద్ద ముగిసింది. పేటీఎం కూడా నాలుగు శాతం లాభపడింది.