దావోస్‌లో గౌతమ్ అదానీతో సీఎం జగన్ భేటీ
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నిర్వహిస్తున్న సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో జగన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై అదానీతో సీఎం చర్చలు జరిపినట్లు ఏపీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అంతకముందు WEF వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో జగన్ సమావేశమయ్యారు. అలాగే WEF హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. WEF మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. అలాగే బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్‌తో సమావేశమయ్యారు. మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే మర్యాద పూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.