లిస్టెంగ్ రోజే 73 శాతం లాభం?
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం కానుంది. బజాజ్ ఫైనాన్స్‌కు అనుబంధ కంపెనీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ఐపీఓల ఇన్వెస్టర్లకు రూ. 66-77 మధ్య ధరకు షేర్లను ఆఫర్ చేస్తోంది. గరిష్ఠ ధర రూ. 77కే అత్యధిక బిడ్లు వస్తాయని మార్కెట్ అంచనా. 11న ముగిసే ఈ ఇష్యూ ఇదే నెల 16వ తేదీన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. గరిష్ఠ ఇష్యూ ధర రూ. 77ని పరిగణనలోకి తీసుకున్నా… ఈ షేర్ రూ.120 లేదా రూ. 121 వద్ద లిస్ట్ అవుతుందని అనధికార మార్కెట్ వర్గాలు అంటున్నారు. గ్రే మార్కెట్‌లో ఈ ఇష్యూకు అత్యధిక ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇష్యూ ద్వారా రూ. 6,560 కోట్లను సమీకరించాలని ప్రమోటర్లయిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ భావిస్తున్నాయి. ఇందులో రూ. 3000 కోట్లను ఇప్పటికే ఉన్న షేర్లను అమ్మడం ద్వారా ప్రమోటర్లు సమీకరించనున్నారు. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ ప్రమోటర్లకు ఉన్న ఇమేజీ దృష్ట్యా లిస్ట్ రోజు ఈ ఐపీఓకు 73 శాతంపైగా లాభం రావొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.