నికర లాభంలో 61 శాతం కోత
సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో వేదాంత లిమిటెడ్ రూ. 37,351 కోట్ల టర్నోవర్‌పై రూ. 1808 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 31,074 కోట్లపై రూ. 4615 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆదాయం స్వల్పంగా పెరగ్గా నిరక లాభం మాత్రం 60.8 శాతం క్షీణించింది. లాభం భారీగా తగ్గడానికి కారణం ఖర్చులేనని కంపెనీ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఖర్చుల రూ. 23,171 కోట్ల నుంచి రూ. 33,221 కోట్లకు చేరినట్లు వేదాంత తెలిపింది.