అతిపెద్ద క్రిప్టో చోరీ..
సుమారు 60 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని హ్యాకర్లు దొంగలించారు. గేమింగ్ ప్రధాన బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫామ్ రోనిన్ నెట్వర్క్ నుంచి ఈ దొంగతనం చేశారు. క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఇది రెండో అతి క్రిస్టో కరెన్సీ చోరీ. ఆన్లైన్ గేమ్ ‘ఆక్సీ ఇన్ఫినిటీ’ ఆధారంగా తయారు చేసిన ఎన్ఎఫ్టీకి చెందిన బ్లాక్ చైన్ ప్లాట్‌ఫామ్‌తో లింకైన క్రిప్టో కరెన్సీ ఎథీరియంను దొంగలించారు. 1,73,600 ఎథీరియంలతో పాటు 2.55 కోట్ల డాలర్ల విలువైన స్టేబుల్ కాయిన్‌ను డిజిటల్ లెడ్జర్ నుంచి చోరీ చేసినట్లు రోనిన్ నెట్వర్క్ తెలిపింది. మార్చి 23వ తేదీన ఈ చోరీ జరిగింది. ఆ కరెన్సీ విలువ దాదాపు 54.5 కోట్ల డాలర్లు. ప్రస్తుత కరెన్సీ రేటు ప్రకారం విలువ 61.5 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దొంగలించిన కరెన్సీ ఇంకా హ్యాకర్ల వ్యాలెట్‌లోనే ఉన్నట్లు రోనిన్ నెట్వర్క్ చెప్పింది.