For Money

Business News

లిస్టింగ్‌ రోజే నష్టాలు

రేమాండ్స్‌ లిమిటెడ్‌ నుంచి విడగొట్టి వేరే కంపెనీగా నెలకొల్పిన రేమాండ్‌ లైఫ్‌ స్టయిల్‌ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ. 3020 వద్ద లిస్ట్‌ కాగా, తొలుత రూ. 3100ని తాకింది. ఆ తరవాత అయిదు శాతం లోయర్‌ సర్క్యూట్‌ను ఈ షేర్లు తాకాయి. 5 శాతం నష్టంతో రూ. 2869 వద్ద ముగిసింది. వాస్తానికి ఈ షేర్‌ బేస్‌ ప్రైస్‌ రూ. 1562. అంటే 99 శాతం ప్రీమియంతో ఈ షేర్‌ లిస్టయిందన్నమాట. జులైలో ఈ కంపెనీని రేమాండ్‌ నుంచి విడగొట్టారు. ఇవాళ లిస్టయిన ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 17,478 కోట్లు. అయితే రేమాండ్స్‌ లిమిటెడ్‌ మాత్రం స్వల్ప లాభంతో ముగిసింది. ఇక నుంచి రేమాండ్‌కు చెందిన రీటైల్‌, లైప్‌ స్టయిన్‌ వ్యాపారాన్ని రేమాండ్‌ లైప్ స్టయిల్‌ కిందికి వస్తాయి.