క్రిప్టో కరెన్సీ లాభాలపై 30 శాతం పన్ను?
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో క్రిప్టో లావాదేవీలపై భారీ స్థాయిలో పన్ను విధించే అవకాశముందిన ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ చట్టం తెస్తామన్న ప్రభుత్వం చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో వచ్చే బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను పన్ను చట్ట పరిధిలోకి తెచ్చి… వీటిలావాదేవీల వల్ల లాభం వస్తే వాటిపై 30 శాతం పన్ను వేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ షోలు, లాటరీలు, పజిల్స్‌లో గెలిచినవారిపై ఈ తరహా పన్ను వేస్తున్నారు.