For Money

Business News

వాటిపై 250% దాకా టారిఫ్‌ వేస్తాం

తమ దేశం దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై తాను వేసే సుంకం మున్ముందు 250 శాతం దాకా చేరుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. తొలుత చిన్న మొత్తంలో టారిఫ్‌ వేసినా.. ఏడాది లేదా ఏడాదిన్నరలో ఆ సుంకాలు 250 శాతానికి చేరుతామని ఆయన అన్నారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఫార్మా కారణంగా స్విట్జర్‌ల్యాండ్‌ భారీగా లాభపడుతోందని అన్నారు. మున్ముందు సెమికండక్టర్స్‌, చిప్స్‌పై కూడా భారీ ఎత్తున సుంకాలు ఉంటాయని అన్నారు. అయితే వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు.