ఇక 250 సీసీ బైక్‌లదే రాజ్యం.. రాజీవ్ బజాజ్
ఇక మార్కెట్లో 250 సీసీ బైక్‌ల తుపాను రానుందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. 250 సీసీ నుంచి 400 సీసీ స్పోర్ట్స్ బైక్ విభాగంలో తమ కంపెనీ వాటా 20 శాతంపైనే అని ఆయన సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో అన్నారు. పల్సర్ 250పై తాము ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని అన్నారు. బాజాజ్ అమ్మకాల్లో 15 లక్షల వాహనాలు పల్సర్వేనని అన్నారు. ఇపుడు 250 సీసీ బైక్‌లకు డిమాండ్ లేకపోవడానికి కారణం… అసలు సరఫరా లేకపోవడమేనని అన్నారు. చిప్‌లు దొకరకనందున బైక్‌లను సరఫరా చేయలేకపోతున్నామని అన్నారు. చిప్ కొరత మరో 15 నెలలు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ హస్క్‌వర్ణ స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామన్నారు. ఎలక్రిక్ వెహికల్స్‌పై తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.