రేంజ్ రోవర్ స్పోర్ట్.. రూ. 1.64 కోట్లు!
ఇటీవలే న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను జాగ్వర్ ల్యాండ్ రోవర్ మార్కెట్ ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో వస్తున్న ఈ ఎస్యూవీ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభిచంఇంది. రేంజ్ రోవర్ లుక్‌ను కొనసాగిస్తూనే లాంగర్ వీల్‌బేస్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లను జోడిస్తూ లేటెస్ట్ స్పోర్ట్ ఎడిషన్‌ను ల్యాండ్‌రోవర్ సిద్ధం చేసింది. ఈ నాలుగు వేరియంట్లలో డైనమిక్ SE మోడల్‌ను రూ. 1.64 కోట్లకు, డైనమిక్ HSE మోడల్‌ను రూ. 1.71 కోట్లకు ఆఫర్ చేస్తోంది. ఇక ఆటోబయోగ్రఫీ మోడల్ ధర రూ. 1.81 కోట్లు కాగా, ఫస్ట్ ఎడిషన్‌ను రూ. 1.84 కోట్లకు ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి డెలివరీ ఇవ్వడం ప్రారంభం కావొచ్చు. టాటా మోటార్స్‌కు జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనుబంధ కంపెనీ.