NIFTY LEVELS: 17,000 కీలకం
నిఫ్టి 200 రోజుల చలన సగటు 16992. నిఫ్టి నిన్న 16858 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల లాభంతో ఉంది. సో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని చేరనుంది. టెక్నికల్‌గా ఈ స్థాయి మార్కెట్‌కు చాలా కీలకం. నిఫ్టి మున్ముందు గ్రీన్‌లో ఉండాలంటే…ఈ స్థాయిని నిఫ్టి కాపాడుకోవాలి. ఈ స్థాయిలో ఉంటే నిఫ్టిని కొనుగోలు చేయడం వేస్ట్ అని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి 17066 స్థాయిని దాటితేనే మరింత బలపడే అవకాశముంది. ఇవాళ వీక్లీ, మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్.. రేపు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు. ఈ నేపథ్యంలో నిఫ్టి 17066ని దాటుతుందా అన్నది చూడాలి. ఈ స్థాయిని దాటితే తదుపరి ప్రతిఘటన 17159 అని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. వాస్తవానికి నిఫ్టి టెక్నికల్ సెల్ కాల్ 16935 వద్ద ఉంది. నిఫ్టి 16995ను దాటి నిలబడితే అప్ బ్రేకౌట్ ఛాన్స్ ఉంది. ఒకవేళ పడితే 16906ని నిఫ్టి కాపాడుకోవాలి. లేదంటే నిఫ్టి 16782 దాకా పడే అవకాశముంది. అంటే మధ్యలో పెద్దగా మద్దతు ఉండే అవకాశం లేదు. అయితే 16800 వద్ద పుట్ రైటింగ్ చాలా అధికంగా ఉన్నందున నిఫ్టి ఈ స్థాయి దిగువకు రాకపోవచ్చు.