For Money

Business News

NIFTY TRADE: 17850 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 17,929. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు. సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ఉంది. మన మార్కెట్‌లో నిఫ్టి ఓపెనింగ్‌ నుంచి ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడండి. పెరిగితే 18,000దాకా ఆగండి.18020 వద్ద అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంది. ఈ స్థాయికి చేరితే 20 పాయింట్ల నష్టంతో అమ్మండి. టెక్నికల్‌గా నిఫ్టి బలహీనంగా ఉంది. అన్ని సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 18000 ప్రాంతంలోనే అమ్మొచ్చు. ఒకవేళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడి వేస్తే వెయిట్‌ చేయండి. నిఫ్టికి ఇవాళ 17,850 కీలకం. ఈ స్థాయి పైన ఉన్నంత వరకు ఢోకా లేదే. పడినా 17,830 ప్రాంతంలో మద్దతు అందవచ్చు.17800 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు.